క్షేత్ర చరిత్ర
భక్తుల కొంగు బంగారం శంతాస్వరూప, సంకల్పసిద్థి శ్రీ లక్ష్మినృసింహుడు కొలువుదీరీన ఈ మహిమన్విత క్షేత్రములో గత అనేక దశాబ్దాలుగా ( 70 స౦ లు పైనే) ప్రస్తుత అమ్మవార్ల ఆలయ స్థానములో దీపరాదన జరుగుతూ ఉంది. ఈ విధంగా క్రమబద్దంగా దీపరాదన పూజలు జరుగుతున్న తరుణంలోనే

గుడి నిర్మాణం నేపద్యం….

ఆలయ ఛైర్మన్ లక్ష్మీనారాయణ గారి కుటుంబం ఏళ్ల తరబడి లక్ష్మీనృసింహ స్వామి వారి సేవలో గడుపుతోంది. సుమారు వన్దేళ్లకు పైగా వీరింట్లో అఖండదీపం వెలుగుతుంది . ఈయన లక్ష్మీనృసింహ స్వామి ఊపాసకులు. నిత్యం ఉదయం, సాయంత్రం తన ఇంట్లోనే స్వామి పూజలు సేవల్లో గడుపుతారు. తన తాత హయాం నుంచి నీయమ నిష్టలతో ఉంటుంది కుటుంబం. ఓ రోజు … తన తర్వాత కొడుకు కొడుకు .పెద్దయ్యాక దేవుడి

పరిస్థితీ ఏమిటన్నా ఆందోళన పట్టూకుందాయనకు. ఆధునికయుగంలో పూజలకు, పునస్కారాలకు మాస్కాకొడుతున్న ఈ సమయంలో తన కొడుకు తనాల నిష్టగా ఉంటాడా? దేవుడిని కోలుస్తాడా? ఆనే ఆందోళన పటి పీడించింది. ఓ రోజు ఇదే విషయం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నారు. దట్టంగా రోమలున్న ఓ చేయి వచ్చి ఆయన తలపై నిమిరి నిద్రలేపింది. ‘ నీ ఆందోళన నా గురించే కదా’ అని పలకరించింది. పదమంటు వెంట తీసుకెళ్లింది తీర అక్కడికెళక ఆ చేయి కాస్తా ఓ భారీ ఆకారంగా మారింది . ఆ ఆకారమే లక్ష్మీనృసింహుడు. తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ తర్వాత అంత _______. లక్ష్మీనారాయణ ————- పొందిన తర్వాత తన అనుభవాణి నమ్మాలేక పోయారు. వేద పండితులను సంప్రదిస్తే స్వామి విశ్వరూపం చూపిన చోటు గుడి కట్టమన్నారు. ఆ ప్రాంతం అయిన పొలమే. ఆ —— రోజే (19 ఏప్రిల్ 2007) ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు . దాతలు సహకరించారు . చకచక ఆలయ నిర్మాణం పూర్తయింది. 7 నెలలకే ప్రారబనికి సిద్ధమైంది. విగ్రహ ప్రతిస్టి జరపడానికి తొమ్మిది నెలల సమయం తీసుకోవాలనే నిభాంధన ఉన్నందున ఓ నెల రోజుల పాటు ఆగి, 1 మే 2008 ప్రతిస్టి కర్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెపుకోవాలి . యాదగిరిగుట్టలో అనుసరిస్తున విధానాన్నే ఇక్కడ అమలు చేస్తున్నారు. ———— సమయంలోను .54 మంది వేదపండితులు అక్కడ నుంచే వచ్చారు. లక్ష్మీనృసింహుడి, ఆంజనేయడి, గణపతి విగ్రహాల ప్రాతిస్టాపన, ———- ప్రతిస్టి ఒకే రోజు ఏకకాలంలో జరిగాయి. లక్ష్మీనృసింహుడికి ఆలయం నిర్మించడానికి ముందే ఇక్కడ నల్లపోచమ్మ, బంగారుమైసమ్మ నాగదేవత ఆలయాలున్నాయి .లక్ష్మీనారాయణ గారికి మల్లె చాలా ఏళ్ల కిందట ఆయన తండ్రి గారికి అమ్మవారు కలలో ప్రత్యక్శమై నల్లపోచమ్మ,బంగారుమైసమ్మ ఆలయాలు నిర్మించాలని చెప్పారాట . అపుడే ఆయన ఇదరీకి ఆలయాలు నిర్మించారు . ఆ తరువాత ఆ అలయలను ——— . 2010 ఆగస్ట్ 14న (నాగపంచమి రోజున) దేవసేనా వల్లి సమెత నగ ____ విగ్రహ ప్రతిష్ట జరిగింది.