లక్ష్మినృసింహుడు పిలిస్తే పలికే దేవుడు. సంకల్పం నెరవేర్చే దేవుడు. ఎవరి రూపంలోనైనా వచ్చి కష్టాని దూరం చేసే, కార్యాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన మహిమలు అనంతం, నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారం. అలాంటి దేవుడు చిర్యాలలో కొలువుదీరి ఉండడం నిజంగా నేను చేసుకున పుణ్యం . ఈ ప్రాంత వాసులు, నగరవాసుల అదృష్టం. అనేక సంవత్సరాలుగా ఆయన సేవలో తరిస్తున నాకు, నాకుటుంబానికి అయిన మహిమలు రకరకాలుగా అనుభవంలోకి వచాయి. ఈ గుడి నిర్మాణమే ఒక అద్బుతంగా చెపుకోవచ్చు, నిర్మిస్తునకాలంలోనూ ఆ స్వామి అనేక అద్బుత సంఘటనలు చూపించారు. చిర్యాల లక్ష్మీనృసింహస్వామివారి సన్నిదిలొ 41సంఖ్య శ్రేష్ఠమైనదిగా చెపుకోవచ్చు. 41 రోజుల పాటు స్వామికి కోబరీకాయ కోటి వదిలేస్తే అనుకున్నది నెరవేరుతుంది. 41 రోజుల పాటు ఈ ఆలయ పరిసరాల్లో ఉన్నఇధు శనివారాలు ఇకడ నిద్రించినా (41 రోజుల పరిధిలో ) పీడలు దూరమవుతాయి. పౌర్ణమి, అమావాస్య రోజులలో ఈ ఆలయం లో బస చేస్తే భయాలు , ఆందోళనలూ తొలగిపోతాయి.

గృహబాధలు, గ్రహబాధలు, ఆర్ధిక, ఆనారోగ్యబాధలు , విద్య, ఉద్యోగం, ఉపాధి, పదవులు వచ్చినట్టే వచ్చి దూరం కావడం, పిల్లలు కలగకపోవడం, వీసా దొరకడంలో తదితర సమస్యలేమున్నా ఇక్కడికి వచ్చి లక్ష్మి నరసింహుడికి,గణప్‌తికి, ఆంజనేయుడికి, బాగారు మైసమ్మ,నల పోచమ్మ అమ్మవర్లకు, నాగదేవతకు, 41 ప్రదిక్షణలు చేయండి. మనసులో కష్టాని చెపుకుని, వాటిని దూరం చేయమని కోరి కోబరీకాయ కొట్టి వదిలేయండి . అంతా వారే చూసుకుంటారు. సమస్య త్రివత బాగా ఉన్నవారు ఇదు శనివారాలు నిద్రించి, ఆదివారం ఉదయమే ప్రదిక్షణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. విధివిధానాల కోసం నన్ను కానీ, పూజారిని కానీ సంప్రదించండి.